
ఈ 69న్యూస్ స్టేషన్ ఘనపూర్, మార్చి 10
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణపై భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా చెడు వ్యసనాల వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ విద్యార్థులు, యువతలో అవగాహన కల్పించారు.మత్తు పదార్థాల వినియోగం వల్ల ఆరోగ్యం, కుటుంబ జీవితం మరియు భవిష్యత్తుపై కలిగే దుష్పరిణామాలను వివరించారు.ఈ కార్యక్రమంలో పోలీసులు, తహశీల్దార్, ఎంపీడీఓ, ఎక్సైజ్, వైద్యశాఖ అధికారులు మరియు మున్సిపల్ ఛైర్మన్ పాల్గొన్నారు.మత్తుకు బానిసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని, యువత సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని అధికారులు సూచించారు.