స్టేషన్ ఘనపూర్, జూన్ 26: స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఎంపీ డా.కడియం కావ్య,ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు.చిల్పూర్ మండలం మల్కాపూర్,చిన్న పెండ్యాల గ్రామాల్లో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.ఎంపీ కావ్య మాట్లాడుతూ లెదర్ పార్క్, ఫుట్ ఓవర్ బ్రిడ్జులు,సర్వీస్ రోడ్లు,టూరిజం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.ఎమ్మెల్యే శ్రీహరి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందన్నారు.రుణమాఫీ,బోనస్,రైతు భరోసా వంటి పథకాలు రైతులకు మేలు చేస్తున్నాయని వివరించారు.గత పాలకుల అవినీతిపై విమర్శలు చేశారు.