
స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టికెట్ తనకే కేటాయించాలని బిజేపి రాష్ట్ర నాయకులు స్టేషన్ ఘనపూర్ నియోజక వర్గ ఇంచార్జి పెరుమాండ్ల వెంకటేశ్వర్లు శుక్రవారం బిజేపి అధ్యక్షుడు కిషన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో 2008 సంవత్సరమున జరిగిన ఉప ఎన్నికలలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓటమి పాలైన నేను 2009 సంవత్సరంలో జరిగిన సాధారణ ఎన్నికలలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైనప్పటికీ గత ఎనిమిది సంవత్సరాలుగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతూ 2018లో జరిగిన సాధారణ ఎన్నికలలో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలైయ్యాను కాబట్టి ఈసారి స్టేషన్గన్పూర్ నియోజకవర్గం నుంచి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశానని తెలిపారు.