స్టోరీ మరిపెడ మునిసిపల్ చైర్మన్
పేరు: వీసారపు ప్రగతి
భర్త : వీసారపు శ్రీపాల్ రెడ్డి
తండ్రి: టేకుల యాదగిరి రెడ్డి
తల్లి : టేకుల సుశీల
విద్యా అర్హత: గ్రాడ్యుయేషన్
రాజకీయ నేపథ్యం: ప్రగతి తండ్రి టేకుల యాదగిరి రెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ అనంతరం తొర్రూర్ మార్కెట్ చైర్మన్ గా, తల్లి టేకుల సుశీల పెదనాగారం గ్రామ సర్పంచ్ గా (ఏకగ్రీవం), నరసింహుల పేట మండల ఎంపీపీగా (ఏకగ్రీవం) పనిచేశారు.
వీసారపు ప్రగతి 2020లో. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు కౌన్సిలర్ గా (ఏకగ్రీవం), పనిచేసే ప్రస్తుతం మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు.
భర్త వీసారపు శ్రీపాల్ రెడ్డి విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి మున్సిపాలిటీ కేంద్రంలో విద్యా సంస్థలు (1996లో వివేకానంద ఉన్నత పాఠశాల, 2011లో రెయిన్బో గ్లామర్ స్కూల్) స్థాపించి 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోని అనేక మంది విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చి దిద్దిన అపార అనుభవం, ప్రస్తుతం జేజే బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసి వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. అదేవిధంగా మూడు సంవత్సరాలు లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా అనేక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు మండల స్థాయిలో జరిగే ప్రతి సేవ కార్యక్రమాలలో ముందుండేవారు.
తను స్వతహాగా రాజకీయ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని రావడంతో పాటు అన్ని రంగాల్లో అనుభవం, ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్, పార్టీ నాయకత్వానికి అనుకూలంగా ఉండడంతో పార్టీ అధిష్టానం వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డిని గుర్తించి మరిపెడ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠాన్ని కట్టబెట్టింది.
అన్ని విధాల అనుభవం కలిగిన వ్యక్తి చైర్ పర్సన్ కావడంతో మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మున్సిపాలిటీ ప్రజలు ఆశిస్తున్నారు.