స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్‌లర్‌గా డాక్టర్ కిషోర్ గోపీనాథ్
తెలంగాణలో నూతనంగా ఏర్పాటు అవుతున్న స్పోర్ట్స్ యూనివర్సిటీకి వైస్ ఛాన్స్‌లర్‌గా నియమితులైన డాక్టర్ కిషోర్ గోపీనాథ్,తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ గోపీనాథ్‌కు చైర్మన్ శివసేనారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఏర్పాటు అవుతున్న ఈ క్రీడా విశ్వవిద్యాలయ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని,క్రీడాకారులకు అత్యుత్తమ శిక్షణా సదుపాయాలు అందించే విధంగా ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు.ఈ భేటీ ఎంతో సానుకూల వాతావరణంలో జరిగినట్టు సమాచారం.