
హన్మకొండ నగరంలోని ఎక్సైజ్ కాలనీలో చెయిన్ స్నాచింగ్ ఘటన చోటుచేసుకుంది. ఈ రోజు శుక్రవారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయంలో మామిండ్ల నవ్య మెడలో ఉన్న బంగారు చెయిన్‌ను గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు.దుండగున్ని ఆపేందుకు బాధితురాలు ప్రయత్నించగా, అతడు బైక్‌పై వేగంగా అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బాధితురాలు సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.