ఈ69న్యూస్:హన్మకొండ జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీలో రేషన్ డీలర్లు ప్రభుత్వం ఆదేశాలను ఉల్లంఘిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఎక్కడైనా బియ్యం తీసుకునే వీలుంటే కూడా,మీ గ్రామంలోనే తీసుకోండి,ఇక్కడ ఇవ్వం అని డీలర్లు బియ్యం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.జూన్,జూలై,ఆగస్టు నెలల బియ్యం ఒకేసారి ఇవ్వడంతో ప్రజలు ఎండలో గంటల తరబడి లైన్లలో నిలబడి ఇబ్బందులు పడుతున్నారు.నీడ,తాగునీటి వంటి సౌకర్యాలు లేక ప్రజలు తీవ్రంగా అవస్థలు పడుతున్నారని వాపోతున్నారు.ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.