హామీలను విస్మరించిన కాంగ్రెస్-మాజీ ఎమ్మెల్యే రాజయ్య
ఎన్నికల హామీలను విస్మరించిన కాంగ్రెస్ కు స్థానిక ఎన్నికలలో ఓట్లు అడిగే అర్హత లేదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య అన్నారు.సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం జనగామ జిల్లా చిల్పూర్ మండలం కృష్ణాజి గూడెం,ఫతేపూర్,లింగంపల్లి,శ్రీపతి పల్లిగ్రామాలలో సర్పంచ్ అభ్యర్థులు,వార్డు సభ్యుల అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తులం బంగారం,ఆడపిల్లలకి స్కూటీ,పెన్షన్ పెంపు, ప్రతి మహిళకు 2000 రూపాయలు మొదలైన హామీలేవని ప్రశ్నించారు.ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడగడం సిగ్గుచేటు అన్నారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.శ్రీపతిపల్లిలో టిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బూరు సురేఖ మాట్లాడుతూ ..గ్రామంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇప్పించి ఉపాధి మార్గాలు చూపిస్తామని గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ కేశవరెడ్డి మనోజ్ రెడ్డి,మండల ఇంచార్జ్ మాలోత్ రమేష్ నాయక్,రంగు హరీష్,విష్ణు,రాకేష్,రంజిత్ తదితరులు పాల్గొన్నారు.