హిమ్మత్ నగర్లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహణ
Jangaon, Telanganaజాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హిమ్మత్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం మధ్యాహ్నం వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మంగు జయప్రకాశ్ మాట్లాడుతూ..ఉపాధ్యాయులు అంటే సోషల్ ఇంజనీర్లు.సమాజంలోని అనేక వృత్తి నిపుణులను తయారు చేసే గొప్ప బాధ్యత ఉపాధ్యాయులదే.మనిషిని ఉన్నతుడిగా తీర్చిదిద్దే మహత్తర బాధ్యత ఉపాధ్యాయుల భుజాలపైనే ఉంటుంది అని అన్నారు.అలాగే విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించి సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా నిలుస్తారని పేర్కొన్నారు.నేటి బాలలే రేపటి పౌరులు.వీరి చదువుల బాధ్యత ఉపాధ్యాయులదే.చదువును నిర్లక్ష్యం చేస్తే సమాజం నిరుపయోగంగా మారుతుంది అని ఆయన హెచ్చరించారు.విద్యా బోధనలో ఉపాధ్యాయులు చిత్తశుద్ధి కనబరిస్తే తప్పక సత్ఫలితాలు సాధించవచ్చని జయప్రకాశ్ అన్నారు.ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బాస్కుల శోభారాణి,ఉపాధ్యాయురాలు రాణి,ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు పసునూరి కవిత,కడారి వసంత,గాదె వెంకటస్వామి,వెంగల జితేందర్,దామెర ఉపేందర్,మోదుగ వనజాత,పొరిక మంజుల,భూక్యా వంశీకృష్ణ,దీకొండ మాధవి,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.