ఈ69న్యూస్: జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలోని హిమ్మత్ నగర్ జడ్పీహెచ్ స్కూల్ లో పదవ తరగతి 1999-2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు,తమ విద్యాభ్యాసం పూర్తి చేసి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మళ్లీ కలుసుకొని ఆత్మీయ సమ్మేళనంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సమావేశంలో వారు తమ బాల్యపు మధుర జ్ఞాపకాలను పరస్పరం పంచుకుంటూ,గతాన్ని తలచుకుంటూ ఆనందంగా గడిపారు.కార్యక్రమంలో రాజ్ కుమార్,ముహమ్మద్ జలీల్,ముహమ్మద్ అక్బర్,సోమయ్య,సంపత్,శ్రీనివాస్,సారయ్య,ఎండీ ఖాసిం,వై.సతీష్,మహేందర్,బక్కం రాజు,యు.నాగరాజు,వై.నాగరాజు,శోభన్ బాబు,అనుముల రాజు,మంజుల,సురంజని, అనసూర్య,సంధ్య,సరోజ,నాగలక్ష్మి,అరుణ,శోభారాణి తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం అందరికీ ఆనందాన్ని కలిగించి,మధురానుభూతులను మిగిల్చింది.