*సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టర్ కు వినతి

ఈ69
జనగామ జిల్లా నర్మేట మండలం వెల్దండ గ్రామంలో గత ప్రభుత్వం నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో జరిగిన అవకతవకలను సరిచేసి అర్హులైన హైకోర్టును ఆశ్రయించిన వెల్దండ గ్రామ నిరుపేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషకు సిపిఎం జనగామ జిల్లా కార్యదర్శి మరియు బృందం వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి బాద్ధులైన అధికారులపై చర్యలు తీసుకొని హైకోర్టును ఆశ్రయించిన వెల్దండ గ్రామ నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని వారు కలెక్టర్ ను కోరారు.హైకోర్టు ఆర్డర్ డైరెక్షన్ ప్రకారం హైకోర్టును ఆశ్రయించిన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని అనర్హులైన వారిని తొలగించాలని హైకోర్టు డైరెక్షన్ ఇచ్చిన నేటికి సమగ్ర విచారణ జరపడంలో అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారో చెప్పాలన్నారు.వ్యవసాయ భూములు ప్లాట్లు కార్లు బిల్డింగ్ లు హైదరాబాదు హలో మూడంతస్తుల బిల్డింగ్ ఉన్న వ్యక్తికి వ్యాపారాలు చేసుకునే వాళ్లకు సైతం నిబంధనలకు విరుద్ధంగా వెల్దండ గ్రామంలో డబల్ బెడ్ రూమ్ లను పంపిణీ చేశారన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఇట్టి విషయంపై త్వరగా విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలతో పాటు అనర్హులను గుర్తించి వారికి కేటాయించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను చట్ట ప్రకారం రద్దు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొట్ల శేఖర్ జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి సుంచు విజేందర్ పి ఉపేందర్ పట్టణ కమిటీ సభ్యులు మంగ బీరయ్య బాధితులు శివ గాని సావిత్రి చందం చంద్రకళ బెల్లి కొమరవ్వ కళ్యాణం కళావతి అనిత నాగరాజు తదితరులు పాల్గొన్నారు.