
KHAMMAM MP NEWS BHATTI NEWS
రాష్ట్ర ఇంచార్జ్ దిపాదాస్ మనిషా గారి అధ్యక్షా కాంగ్రెస్ భవన్ నందు జరుగుతున్న సమావేశంలో ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా అనూహంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు భట్టి నందిని గారిని తెరమీదకి తెచ్చిన రాష్ట్ర ఇంచార్జ్..
కాంగ్రెస్ పార్టీ విజయానికే రాష్ట్రస్థాయిలో ప్రజా నాయకుడిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారితో పాదయాత్రలో పాల్గొనడమే కాకుండా రాష్ట్రస్థాయి కాంగ్రెస్ పార్టీ బలోపేతనికి కేంద్ర పెద్దలతో నిత్యం చర్చిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషించిన అమ్మ ఫౌండేషన్ అధినేత్రి శ్రీమతి మల్లు నందిని గారికి ఖమ్మం జిల్లాలో సామాజిక సేవ కార్యక్రమాలతో మంచి పేరు ఉండడంతో పార్టీ పెద్దలు ఖమ్మం పార్లమెంట్ బరిలో నిలిపేందుకు నిర్ణయించినట్లు సమాచారం.. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ముఖ్యమంత్రి పదవి సైతం త్యాగం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుటుంబానికి పార్టీ అధిష్టానం గౌరవం ఇచ్చే దిశగా నిర్ణయం తీసుకున్నారు.