ఈ69న్యూస్ హైదరాబాద్:సైదాబాద్‌లో జూన్ 13న అహ్మదీయ ముస్లిం మహిళా విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించబడింది.కమ్యూనిటీ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి మహిళా విభాగాధ్యక్షురాలు మర్యమ్ అజీమ్ నేతృత్వం వహించారు.కమ్యూనిటీకి చెందిన అనేక మహిళా వాలంటీర్లు మానవతా సేవలో భాగంగా ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు.ఈ సందర్భంగా మహిళా విభాగ నాయకురాలు మాట్లాడుతూ..కమ్యూనిటీ అందరినీ ప్రేమించు-ఎవ్వరినీ ద్వేషించకు’అనే నినాదంతో శాంతి, దయ,సమానత్వం,మానవతా విలువలను ప్రోత్సహిస్తూ ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది”అని చెప్పారు.1889లో హజ్రత్ మీర్జా గులాం అహ్మద్ స్థాపించిన అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ప్రస్తుతం ప్రపంచంలోని 210కిపైగా దేశాలలో విస్తరించి 5వ ఖలీఫా హజ్రత్ మీర్జా మస్రూర్ అహ్మద్ ఆధ్వర్యంలో"హ్యూమానిటీ ఫస్ట్" ద్వారా ఆహారం,త్రాగునీరు,వైద్యసేవలు,విపత్తుల సమయంలో సహాయం వంటి అనేక కార్యక్రమాలు చేపడుతోంది.ఈ రక్తదాన శిబిరం ద్వారా మానవత్వానికి చేసిన సేవ స్ఫూర్తిదాయకమైందని,భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని మర్యమ్ అజీమ్ తెలిపారు.