
108 సర్వీస్ లను తనిఖీ
హనుమకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలో ఉన్న 108 అంబులెన్స్ ను జిల్లా మేనేజర్ మండ శ్రీనివాస్ తనిఖీ చేయడం జరిగింది. అత్యాధునిక వైద్య పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి .అత్యవసర పరిస్థితిలో మందులు ఉన్నాయా లేదా మరియు ప్రజలకు అత్యవసర పరిస్థితులలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు .ప్రజలు 108 నంబర్ కి కాల్ చేయగానే 30 సెకండ్లలో బయలుదేరి క్షతగాత్రుడికి మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించి దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకువెళ్లాలని సూచించారు. గత జనవరి నుండి సెప్టెంబర్ వరకు అయినవోలు మండలంలో 810 ప్రాణాలు కాపాడడం జరిగింది .దీనికి జిల్లా మేనేజర్ 108 సిబ్బందిని అభినందించారు.ప్రజలకు 24 గంటల అత్యవసర వైద్య సేవలు అందించాలని 108 సిబ్బందికి సూచించారు .అయినవోలు మండలంలో ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా వెంటనే 108 కాల్ చేసి అత్యవసర వైద్య సేవలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో టెక్నీషియన్ ఏనుగు రాజు
పైలెట్ కొండ తిరుపతి పాల్గొన్నారు