
18 నా జరిగే రాష్ట్ర స్థాయి బిసి బంద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఆమోదించిన బీసీ లకు 42 శాతం బిల్లును కేంద్రం ప్రభుత్వం 9వ షెడ్యూల్ లో చేర్చాలి,
జాతీయ బిసి సంక్షేమ సంఘం మరిపెడ నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినటువంటి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం 9 షెడ్యూల్ లో చేర్చి రాజ్యాంగ బద్దంగా అమలు పరచాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం మరిపెడ మండల నాయకులు డిమాండ్ చేస్తూ గురువారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 నా జరిగే రాష్ట్ర స్థాయి బిసి బంద్ ను జయప్రదం చేయాలని అదేవిధంగా విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీ యాల్లో బిసిలకు రిజర్వేషన్ లు పెంచాలనిగత కొంతకాలంగా జరుగు తున్న పోరాటంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిసిలకు రిజర్వేషన్కూ 42 శాతం రిజర్వేషన్ లు కల్పించాలని శాసనసభలో ఏకగ్రీవంగా తీర్మాణం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పరిగణలోనికి తీసుకోకుండా 9వ షెడ్యూల్ లో చేర్చక పోవడంవల్ల బిసిలకు రిజర్వేషన్లో అన్యాయం జరుగుతుం దన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే బిసి బిల్లును 9వ షెడ్యూల్ లో చేర్చి రాజ్యాంగబద్ధ రక్షణ కల్పించాలనికోరారు. ఈ కార్యక్రమంలో రాంపెల్లి రవి గౌడ్, గందసిరి క్రిష్ణ, దిగజార్ల ముఖేష్,మునిష్,నర్సయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.