50 మద్యం దుకాణాలకు దరఖాస్తుల ఆహ్వానం
జనగామ జిల్లాలోని మొత్తం 50 మద్యం దుకాణాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రోహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారి అనిత తెలిపారు.ఈ మేరకు ఆమె అక్టోబర్ 12న ఒక ప్రకటన విడుదల చేశారు.కేటగిరీల వారీగా మద్యం దుకాణాల కేటాయింపు:-ఎస్.టి.వర్గానికి:01,ఎస్సీ వర్గానికి:05,గౌడ సామాజిక వర్గానికి:13,జనరల్ కేటగిరీ క్రింద:31-ఆసక్తిగల అభ్యర్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా,నిర్భయంగా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారి అనిత పేర్కొన్నారు.ఏదైనా దుకాణానికి తక్కువ దరఖాస్తులు వచ్చినచో ఆర్.సి.నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు ఆమె తెలిపారు.దరఖాస్తులకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నవారు డి.పీ.ఈ.ఓ జనగాం కార్యాలయాన్ని సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చని అధికారి తెలిపారు