సన్మానించిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఈవో...
సన్మానించిన సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు ఈవో…
తల్లాడ మేజర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఆరో వార్డు నుండి పోటీ చేసిన అమర్లపూడి తిరుపతిరావు (వెంకటేష్) విజయం సాధించారు.ఈ సందర్భంగా ఆయనను గ్రామ సభలో సర్పంచ్ పెరికే నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి మరియు ఈవో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ జానీ, షేక్ మెహరాజ్ ఆధ్వర్యంలో ఆయనను శాలువాలు పూలమాలతో సన్మానించి సత్కరించారు.వార్డు మెంబర్ గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయ సాధించడం సంతోషకరమన్నారు. ప్రజలందరికీ మంచి పాలన అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో నాయకులు షేక్ జానీ, మెహారాజ్,రాంబాబు, నాగరాజు,గోపి,వెంకీ,స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు