
ఈ69న్యూస్ హన్మకొండ:-రద్దీ ప్రాంతాల్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలను టార్గెట్ చేస్తూ చోరీలు చేసిన గుగులోత్ చందు లాల్ (24) అనే యువకుడిని హసన్పర్తి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో అనుమానస్పదంగా ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా డెలివరీ ఉద్యోగాలు చేస్తూ, అదనపు డబ్బు కోసం వాహనాలు చోరీ చేసినట్టు వెల్లడించాడు. మొత్తం 18 బైకులు (దాదాపు రూ.10 లక్షల విలువ) మరియు ఒక సెల్ఫోన్ స్వాధీనం చేశారు.