
ఈ69న్యూస్:-వరంగల్ జిల్లా కలెక్టర్ డా.సత్య శారద బుధవారం సంగెం మండలంలోని తిమ్మాపూర్, గీసుకొండ మండలంలోని మచ్చాపూర్ గ్రామాల్లో నేషనల్ గ్రీన్ హైవే నిర్మాణం నేపథ్యంలో భూములు కోల్పోయిన రైతులతో ఆర్బిటేషన్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నేషనల్ హైవే నిర్మాణం వల్ల వరంగల్ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని,భవిష్యత్తులో హైదరాబాదుకు తర్వాత రెండో రాజధానిలా వరంగల్‌ను చూడవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.భూమి కోల్పోయిన రైతులకు న్యాయం చేయడమే లక్ష్యంగా నేషనల్ హైవే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి,సంగెం తహసిల్దార్ రాజ్‌కుమార్,గీసుకొండ తహసిల్దార్ రియాజ్ఉద్దీన్తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.