
ఎసీబీకి చిక్కిన ఆర్ఐ–రూ.26 వేల లంచంతో రెడ్ హ్యాండెడ్గా పట్టివేత
ఈ69న్యూస్:-జనగామ జిల్లా చిల్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి కలకలం రేపారు.ఈ దాడుల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) వినయ్ కుమార్ భూ సర్వే కోసం రూ.26 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు.వివరాల్లోకి వెళ్తే,బాధితుల వద్ద భూ సర్వే కోసం ఆర్ఐ డబ్బులు డిమాండ్ చేయగా,వారు ఏసీబీ అధికారులను సంప్రదించారు.వారి సూచనలతో సోమవారం లంచం ఇస్తుండగా,అధికారులు ఆకస్మికంగా దాడి చేసి పట్టుకున్నారు.అనంతరం ఆర్ఐని అరెస్ట్ చేసి,తదుపరి విచారణ కోసం కోర్టుకు తరలించనున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు.ఇటీవలే స్టేషన్ ఘన్పూర్లో సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి చిక్కిన ఘటన మరువకముందే,ఇప్పుడు చిల్పూర్ మండల కేంద్రంలో జరిగిన ఈ పట్టివేత,జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ శాఖల్లో అవినీతి వ్యాప్తిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
Download
WhatsForm Widget
Move upMove downToggle panel: WhatsForm Widget
Copy and paste the code snippet to add bot to this post or page