
ఎన్జీ కాలేజీలో కరపత్రాల పంపిణీలో డాక్టర్ అక్కనపల్లి మీనయ్య పిలుపు
ఎన్జీ కాలేజీలో కరపత్రాల పంపిణీలో డాక్టర్ అక్కనపల్లి మీనయ్య పిలుపు
సామాజిక విప్లవ వీరులు మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతుల సందర్భంగా 28 తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పెద్ద గడియారం సెంటర్లో జరిగే పూలే అంబేడ్కర్ జన జాతరను జయప్రదం చేయాలని డాక్టర్ అక్కినపల్లి మీనయ్య పిలుపునిచ్చారు. ఈరోజు ఎన్జీ కాలేజీ ఆవరణలో వాకర్స్ సభ్యులకు ఉదయం 5గంటలనుండి కరపత్రాల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ అక్కనపల్లి మీనయ్య మాట్లాడుతూ మహనీయులు ఎదుర్కొన్న కుల వివక్షతలే వారిని శక్తివంతులుగా తయారు చేశాయని తాగే నీళ్లు చదువుకునే చదువు దగ్గర అవమానం ప్రారంభమై లెక్కకు దొరకని అంతరాలను చూశారని అన్నారు. అవమానాలు ఎదుర్కొన్న చోటనే హక్కులను సాధించుకోవాలనే సంకల్పంతో అంతరాలకు కారణమైన మూలాలను తొలగించారని తెలిపారు. అవమానాలు గురవుతున్న అణగారిన దళిత నిమ్న వర్గాల జీవితాలలో ఆత్మ గౌరవం మానవ విలువలు నింపడానికి స్వేచ్ఛ సమానత్వం న్యాయమనే భావనను బలమైన ఆయుధాలుగా ఎంచుకొని మానవతా పోరాటాలకు నాంది పలికారని తెలిపారు. నేడు వివక్ష లేని సమ సమాజ స్థాపన ధ్యాయంగా సామాజిక పోరాటాలకు పదును బెడుతూ ఆత్మగౌరవం సమానత్వం కుల నిర్మూలనకై పోరాడుదాం అని పిలుపునిచ్చారు. జన జాతర సభకు ముఖ్యఅతిథిగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపల్ చింతకింది కాసిం బహుజన యుద్ధనౌక ఏపూరి సోమన్న కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్ బాబు
మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంబటి నాగయ్య గారు తెలుగు అధ్యాపకురాలు ఎంజి యూనివర్సిటీ అనిత గారు నల్లగొండ పట్టణ ప్రముఖులు కవులు కళాకారులు సామాజిక ప్రజా సంఘాల నాయకులు హాజరవుతారని తెలిపారు. పెద్ద ఎత్తున కల్చరల్ ప్రోగ్రామస్ ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మల్లెపాక వెంకన్న చింతపల్లి వెంకన్న సత్యం పట్టణ ప్రముఖులు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున జిల్లా ఆఫీస్ బేరర్స్ గాదే నరసింహ బొట్టు శివకుమార్ బొల్లు రవీందర్ తదితరులు పాల్గొన్నారు