
ఇంటర్ ఫలితాల్లో మెరిసిన వివేకానంద జూనియర్ కళాశాల నిరుపేద విద్యార్థులు
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో వివేకానంద ప్రభుత్వ సహాయ జూనియర్ కళాశాల,వరంగల్ (కాశిబుగ్గ) విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధించారు.ఈ పరీక్షల్లో మొదటి మరియు రెండవ సంవత్సరాల్లోని విద్యార్థులు ఉత్తీర్ణులై కళాశాల ప్రతిష్టను మరింత పెంచారు.ప్రథమ సంవత్సరం ఫలితాలు:జి.అశ్విత్ (MPC):455/470,జె.డానియల్(CEC):440/500,వంశీరాణి సంతోష్ (MPC):419/470,అఫ్రీన్ సుల్తానా(CEC): ఉత్తీర్ణురాలు,-ద్వితీయ సంవత్సరం ఫలితాలు:హర్ష జబీన్ (CEC): 804/1000,ఆయోష బేగం (CEC):681/1000,ఫిర్ డోస్(MPC):610/1000,అఖిల శ్రీ (MPC):656/1000,ఆఫ్రిన్ తబస్సుం,(CEC):581/1000,వసంత (CEC):494/1000-ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.జనార్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కళాశాల మేనేజ్మెంట్ మరియు అధ్యాపక బృందం విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ విజయోత్సవ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్.ప్రకాశం,పి.డి.సతీష్,అధ్యాపకులు బండ్ల కరుణాకర్,జగదీశ్వర చారి,అనిత ఎల్లయ్య,నాన్ టీచింగ్ స్టాఫ్ సభ్యులు భద్రయ్య,రమేష్,కన్నయ్య,నర్సింగరావు,అశోక్ తదితరులు పాల్గొన్నారు.