
ప్లాటు కోల్పోయిన వారిని ఆదుకోండి– గజానికి రూ.15 వేల నష్టపరిహారం ఇవ్వాలి
ఈ69న్యూస్:- జాతీయ రహదారి 365బి నిర్మాణంలో జనగామ పట్టణంలో ప్లాట్లు కోల్పోతున్న యజమానులకు న్యాయం చేయాలని,సర్వే నివేదిక విడుదల చేసి గజానికి రూ.15,000 నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు మెమోరాండం ఇవ్వడం జరిగింది.ప్లాట్లు కోల్పోతున్న బాధితులు భూసేకరణ చట్టంలో ఉన్న హక్కులు కల్పించాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని,అధికారులను సర్వే నివేదిక విడుదలకు ఆదేశిస్తున్నట్టు తెలిపారు.ఈ కార్యక్రమంలో మోకు కనకారెడ్డి,బూడిది గోపి,జోగు ప్రకాష్ తో పాటు పలువురు బాధితులు పాల్గొన్నారు.