
నక్కలపల్లి సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శిగా బన్న కృష్ణ ఏకగ్రీవ ఎన్నిక
ఈ69న్యూస్ వరంగల్:- నక్కలపల్లి సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శిగా బన్న కృష్ణను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు.ఈ కార్యక్రమంలో ఖిలా వరంగల్ ఏరియా కార్యదర్శి నలిగంటి రత్నమాల,సిపిఎం సీనియర్ నాయకుడు నలిగంటి అనిల్ పాల్గొన్నారు.వారు రాష్ట్ర ప్రభుత్వం హామీలను నెరవేర్చకపోవడం మరియు నక్కలపల్లి గ్రామంలో డ్రైనేజీ, వాటర్ సమస్యలు పరిష్కరించాలని కోరారు.అలాగే,నక్కలపల్లి శాఖ సభ్యులుగా మన్నె నర్సిసింగం,ఏస్ కే సలీం,ఉసిల్ల రాజేందర్, బన్న నాగరాజు,ఎర్ర రాజు,మన్నె సుధాకర్,గణేష్ వర్కుటి,సుగుణ బెల్లం,మౌనిక,యమున,అమృత,అనురాధ,నర్మదా,రాధ ఎన్నికయ్యారు.