
తమ్మడపల్లి ఐ గ్రామ అంగన్వాడి సెంటర్లో ప్రీ-స్కూల్ వార్షికోత్సవం
ఈ69న్యూస్:- జనగామ జిల్లా జాఫర్ గడ్ మండలం తమ్మడపల్లి ఐ గ్రామ ఎస్సీ కాలనీ అంగన్వాడి సెంటర్లో ప్రీ-స్కూల్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.తల్లులు,విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పిల్లలు అభ్యసించిన విద్యా కార్యక్రమాలను ప్రదర్శించారు.పోషణ పక్షం ముగింపు సందర్భంగా తల్లులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.అంగన్వాడి టీచర్లు బొందుగుల ఎలిజబెత్,రడపాక రజిత మరియు ఆయా రడపాక వెంకటలక్ష్మి కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించారు.