
ఒంటిమామిడిపల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఈ69న్యూస్:-హన్మకొండ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఒంటిమామిడిపల్లి గ్రామంలో DRDA-సెర్ప్ పౌరసరఫరాల శాఖ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో జై హనుమాన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రం వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్.నాగరాజు సూచనలతో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్,గ్రామ అధ్యక్షుడు గిరుక రాజు ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ రాయపురం సాంబయ్య,మహిళా అధ్యక్షురాలు ఎలిషా,మాజీ జెడ్పీటీసీ బుచ్చిరెడ్డి,రఫీ,సునీల్ తదితరులు పాల్గొన్నారు.