
ఒక్క నిమిషం ఆలస్యం… పరీక్ష రాయనివ్వలేదు!
ఈ69న్యూస్ హైదరాబాద్:-జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌కు చెందిన స్పందన అనే విద్యార్థిని టీజీ ఈఏపీసెట్ రాయడానికి శ్రీనిధి ఇనిస్టిట్యూట్‌కి వచ్చింది. మధ్యాహ్నం 3:00కు చేరుకోవాల్సి ఉండగా, 3:01కు వచ్చింది. కేవలం ఒక నిమిషం ఆలస్యం కావడంతో నిర్వాహకులు పరీక్షకు అనుమతించలేదు. కాలేజీ అడ్రస్ తెలిసి రావడంలో ఆలస్యం అయిందని, గేటు వద్దకైతే సమయానికి వచ్చానని విద్యార్థిని కన్నీరు పెట్టుకుంది. ఒక సంవత్సరం వృథా అయిందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు.