
ఉపాధి కూలీల బిల్లులు చెల్లించకపోతే ఎంపీడీవో కార్యాలయం ముట్టడి: సిపిఎం నేత రాపర్తి రాజు
ఈ69న్యూస్ జనగామ: కుర్చపల్లి గ్రామంలో జరిగిన సిపిఎం సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు రాపర్తి రాజు ప్రభుత్వంపై మండిపడ్డారు.ఉపాధి హామీ పనుల కూలీలకు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడాన్ని తప్పుపడుతూ,తక్షణమే చెల్లించకపోతే ఎంపీడీవో కార్యాలయం ముట్టడి చేస్తామని హెచ్చరించారు.కనీస సౌకర్యాలేవీ లేకుండా కూలీలను పని చేయించడం దారుణమని పేర్కొన్నారు.మే డే సందర్భంగా కార్మిక హక్కుల పరిరక్షణకు పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ లేబర్ కోడ్లను ఖండించారు.సమావేశంలో పలు గ్రామాల సిపిఎం నాయకులు పాల్గొన్నారు