
స్టేషన్ ఘనపూర్ అభివృద్ధే నా ధ్యేయం: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఇప్పగూడెం గ్రామంలో రూ.90 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మించిన సిసి రోడ్డును ప్రారంభించిన ఆయన, గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా పనిచేయాల్సిన అవసరాన్ని తెలిపారు. త్వరలో గ్రామానికి మరో కోటి రూపాయల విలువైన రోడ్లు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఎల్లమ్మ బోనాల ఉత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే, తన పాలన అవినీతిరహితమని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పంట రుణ మాఫీ, బోనస్, ఉచిత బియ్యం వంటి పథకాలతో ముందంజలో ఉందని తెలిపారు.