
కె. వి .వి .ఎస్ .ఎన్ .రాజు
సిపిఎం రాష్ట్ర నాయకులు
కె. వి .వి .ఎస్ .ఎన్ .రాజు
ఫాసిజం పై కమ్యూనిజం విజయం సాధించిన రోజే ప్రపంచంలో విక్టరీ డే గా ప్రసిద్ది కెక్కిందని సిపిఎం రాష్ట్ర నాయకులు కె .వి .వి .ఎన్ .రాజు అన్నారు . సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అధ్యక్షతన సుందరయ్య భవనంలో ఫాసిజం పై కమ్యూనిజం విజయం అనే అంశంపై సదస్సు నిర్వహించారు . ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ , జాతి అహాంకారీ , ఫాసిస్టు హిట్లర్ ను సోవియట్ రష్యా రెడ్ ఆర్మీ ఓడించిన రోజు మే 9 అన్నారు . 1945 మే 9 న జర్మనీ నాజీ హిట్లర్ ను ఓడించి జర్మనీ పార్లమెంట్ పై ఎర్రజెండాను ఎగిరేసిన రోజు అదే ప్రపంచంలో విక్టరీ డే గా ప్రసిద్ధి కెక్కిందన్నారు .
పెట్టుబడి దారి వ్యవస్థ తన ఆర్థిక సంక్షోభాన్ని పక్కదారి పట్టించడానికి ఫాసిజాన్ని పెంచిపోషించిందన్నారు .దానికి హిట్లర్ నాయకత్వం వహించాడన్నారు . జాతి అహాంకారం తో లక్షలాది మందిని ఊచకోత కోసిన హిట్లర్ ను తనకు తానే ఉరివేసుకొని సచ్చెల రెడ్ ఆర్మీ చేసిందన్నారు .
2008 సం”ము లో అమెరికాలో ఆర్థిక సంక్షోభం ప్రారంభం అయ్యి నేడు ప్రపంచ వ్యాపితంగా విస్తరించిందన్నారు . పేదరికం పెద్దఎత్తున పెరిగింది అదే స్థాయిలో కొంత మంది కుబేరుల దగ్గర సంపద పోగుబడుతున్నది అన్నారు .మన దేశంలో 78శతం సంపద ఒక్క శాతం మంది దగ్గర పోగుబడిందన్నారు . పెట్టుబడి దారీ వ్యవస్థ సరిగ్గా నాడు ఫాసిజాన్ని ఉపయోగించు కున్నట్టే నేడు ఫాసిస్టు ధోరణులను పెంచి పోషిస్తున్నదన్నారు ప్రజలను కులం ,మతం ప్రాంతం పేరుతో విడదీస్తూ పోరాటాలను అణిచి వేస్తున్నారని మండి పడ్డారు . పెట్టుబడి దారి వ్యవస్థలో ఆర్థిక అసమానతలు పెరుగుతాయి తప్పా తగ్గవన్నారు . అందుకే ప్రపంచానికి ప్రత్యామ్నాయ వ్యవస్థ సోషలిజం తప్పా మరొక్కటి లేదని ఉద్గాటించారు . ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు ,పూసం సచిన్ ,అన్నమొల్ల కిరణ్ జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ ఆశన్న , ఆర్ ,మంజుల ఆర్ .సురేందర్ ఎం .గంగన్న ,ఎన్ .స్వామి నాయకులు అగ్గిమల్ల స్వామి ,లింగాల చిన్నన్న తదితరులు పాల్గొన్నారు .ప్రభు ,గంగారాం , గంగాసాగర్ తదితరులు పాల్గొన్నారు .