
సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మాలోతు సాగర్,
మే 20న జరగబోయే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె విజయవంతం చేయడానికి సంగెం,గీసుకొండ మండల కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు మాలోతు సాగర్,కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.100 సంవత్సరాల చరిత్ర గల 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త లేబర్ కోడ్స్ తీసుకొచ్చిన బీజేపీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.ఈ కార్యక్రమానికి వివిధ కార్మిక సంఘాల నాయకులు మరియు సీఐటీయూ మండల నాయకులు పాల్గొన్నారు.