వధూవరులను ఆశీర్వదించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంబటి వీరభద్ర గౌడ్ ఈ69న్యూస్ మహబూబాబాద్ : కురవి మండలంలోని నల్లెళ్ల గ్రామంలో సీనియర్ నాయకుడు అంబటి మల్లికార్జున్ ఉపేంద్ర కుమార్తె భవ్యశ్రీ వివాహం రంజిత్ కుమార్తో వైభవంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమానికి కురవి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు,మాజీ జడ్పిటిసి అంబటి వీరభద్ర గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఆయన,వారు సుఖసంతోషాలతో నిండిన వైవాహిక జీవితం గడపాలని,పిల్లలతో ఆనందంగా ఉండాలని ఆశీర్వచనాలు పలికారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి,నాయకులు జైపాల్ రెడ్డి,మహిపాల్ రెడ్డి,బండి ఉప్పలయ్య,బండి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.