జనగామ జిల్లా కలెక్టర్కు తెలంగాణ రైతు సంఘం వినతి పత్రం అందజేత ఈ69న్యూస్ జనగామ: వానాకాలం సీజన్లో రైతులకు పంట రుణాలు ఇవ్వాలని, రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలని, రైతు బీమా ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా చందు నాయక్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని, ఇది ఆర్థిక భారం కలిగిస్తున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు మంగ భీరయ్య, బాణాత్ సురేష్ పాల్గొన్నారు.