వరంగల్ లో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్
వరంగల్ లో ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులు దాడులు
ఈ69న్యూస్ వరంగల్: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఖిలా వరంగల్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్ అధికారులు నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా వరంగల్ రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ దగ్గర గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి,అతని వద్ద నుండి 300 గ్రాముల ఎండు గంజాయి మరియు ఒక మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన వ్యక్తి కరీంనగర్ జిల్లా,జమ్మికుంట మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన గండికోట వేంకటేశ్వర్లు.ఇతను మహారాష్ట్ర నుండి ఎండు గంజాయి తీసుకువచ్చి,వరంగల్లో దాన్ని విక్రయించి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు.సమాచారం అందుకున్న ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారులు వేంకటేశ్వరును అరెస్ట్ చేసి, రిమాండ్కు పంపించారు.ఈ దాడిలో ఎస్.ఐ.ఏ.కబీర్ దాస్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.ఈ వివరాలను ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ కె.రాజు మీడియాకు తెలిపారు.