RTC కార్మిక సమస్యలు పై ప్రభుత్వం స్పందించాలి.
Uncategorizedకార్మిక సంఘాలుతో చర్చించాలి.
RTC కార్మికుల సమస్యలు పై SWF మహాసభ లో చర్చ.
SWF రాష్ట్ర 4 వ మహాసభ లోగో, పోస్టర్ ఆవిష్కరణ._
RTC కార్మికుల సమస్యలు పై ప్రభుత్వం స్పందించాలని, అలాగే కార్మిక సంఘాల పై ఆంక్షలు ఎత్తి వేసి వారితో చర్చించి పరిష్కరించాలని SWF రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నదని TSRTC స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి వి. ఎస్. రావు అన్నారు.
TSRTC SWF రాష్ట్ర 4 వ మహాసభ లు 2025 జూన్ 21,22 తేదీలలో జరుగుతున్న సందర్బంగా మహాసభ లోగోను, పోస్టర్ ను ఈరోజు సిటీ CITU ఆఫీస్ లో ఆవిష్కరించారు.
SWF నిబంధనావళి ప్రకారం ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారిమహాసభ లు జరుగుతాయని,రెండు మహాసభల మధ్య కాలంలో RTC పరిస్థితి, కార్మికుల పరిస్థితి, చేసిన ఆందోళన లు, వచ్చిన అనుభవాలను సమీక్ష చేసుకొని, రాబోయే రెండు సంవత్సరాలకు కర్తవ్యాలు రూపొందించుకొంటామని వారు అన్నారు. ఈ సమీక్ష కాలంలో రాష్ట్రం లో ప్రభుత్వాలుమారినా అవి పాటించే విధానాలలో మార్పు లేదని వాటన్నింటిని ఈ మహాసభ లో చర్చిస్తామని అన్నారు.
అలాగే RTC కార్మికుల మధ్య సంపూర్ణ ఐక్యత సాధించడం వైపు ఉన్న ఆటంకాలు, SWF చేస్తున్న కృషిని గురించి మహాసభ చర్చించబోతున్నదని అన్నారు. సంస్థ రక్షణ,కార్మిక హక్కుల పరిరక్షణకు కొనసాగించాలిసిన కృషి, 2025 జులై 9 న జరుగనున్న సార్వత్రిక సమ్మె జయప్రదం, మహిళలు, రిటైర్డ్ కార్మికుల సమస్యల పరిష్కారం పై ప్రత్యేకంగా మహాసభ చర్చించనున్నదని వారు తెలిపారు.
SWF ఏర్పాటు తర్వాత ప్రధమ మహాసభ కు (1982 నవంబర్ ) ఖమ్మం అతిద్యం ఇచ్చిందని, 43 సంవత్సరాల తర్వాత తిరిగి ఆతిద్యంఇస్తున్నదని అన్నారు.
SWF 4 వ మహాసభ కు AIRTWF జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మయ్య గారు ముఖ్య అతిధి గాను, CITU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగుభాస్కర్, AIRTWF జాతీయ కార్యదర్శి తమిళనాడు RTC కార్మిక నాయకులు అర్ముగ నయనార్, వర్కింగ్ ఉమెన్స్ కో ఆర్డినేషన్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కన్వినర్ శ్రీమతి SV రమ గారు, తెలంగాణ పబ్లిక్ & ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి పి. శ్రీకాంత్, AP SWF అధ్యక్షులు, ప్రధాన కార్యదర్షులు సి హెచ్. సుందరయ్య గారు, పి. అయ్యపు రెడ్డి గారు అతిధులు గా హాజరు అవుతున్నారని తెలిపారు.
జులై 21 ఉదయం 10.30 గంటలకు SWF రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు SWF పతాకావిష్కరణ తో మహాసభ లు ప్రారంభం అవుతాయి.
CITU రాష్ట్ర కార్యదర్శి, ఖమ్మం జిల్లా కార్యదర్శి కళ్యాణం వేంకటేశ్వరరావు ఆహ్వాన సంఘం అధ్యక్షులు గా, SWF రీజియన్ కార్యదర్శి పిట్టల. సుధాకర్ ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి గాను, ఖమ్మం డిపో కార్యదర్శి రోషయ్య కోశాదికారి గాను, SWF ఉప ప్రధాన కార్యదర్శి జి. లింగమూర్తి, SWF ఉపాధ్యక్షులు ఏ. వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి జె. పద్మావతి, రీజియన్ అధ్యక్షులు గుండు మాధవరావు లు చీఫ్ పాట్రన్స్ గా మొత్తం 60 మందితో ఆహ్వాన సంఘం ఏర్పడి మహాసభ ఏర్పాట్లు చేస్తున్నారు.
మహాసభ లోగో, పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో SWF ప్రధాన కార్యదర్శి వి. ఎస్. రావు, AIRTWF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, SWF ప్రచార కార్యదర్శి పి. రవీందర్ రెడ్డి తదితరులు హాజరయారు.