ప్రభుత్వ పాఠశాలల* బలోపేతం కోసం పోరాటం . CPM
Uncategorizedప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం చేసే పోరాటాలకు సిపిఎం పార్టీ ఎప్పుడు అండగా నిలుస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటస్వామి అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ లో బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులను నియమించాలని నిర్వహించిన నిరసన ప్రదర్శనలో మాట్లాడారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గట్టు కేటీ దొడ్డి మండలాల్లో విద్యార్థుల సంఖ్య కనుగుణంగా తక్షణమే ఉపాధ్యాయులను నియమించాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక చేపట్టిన కార్యక్రమానికి తాము సంపూర్ణ మద్దతిస్తున్నామని తెలిపారు గట్టు కేటి దొడ్డి మండలాల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలని ఖాళీగా ఉన్న ఎంఈఓ పోస్టును భర్తీ చేయాలని పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పోరాడిందని గుర్తు చేశారు ప్రభుత్వ పాఠశాలల బాలుపేతం కోసం తెలంగాణ తల్లిదండ్రుల సంఘాన్ని సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులను స్వీపర్లను అటెండర్లను కంప్యూటర్ ఆపరేటర్లను నియమించకపోతే విద్యాభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నించారు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను సైతం సమయానికి అందజేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయంటే అది ముమ్మాటికి పాలకుల నిర్లక్ష్యమే అని అన్నారు ఉపాధ్యాయులు లేకపోతే విద్యార్థులలో వివిధ రకాల సబ్జెక్ట్ లలో నైపుణ్యాలు ఏ విధంగా పెరుగుతాయని ప్రశ్నించారు వెనుకబడిన మండలాల్లో విద్యాభివృద్ధి కోసం సిపిఎం పోరాడుతూనే స్వచ్ఛంద సంస్థలు చేసే పోరాటాలకు సైతం మద్దతిస్తుందని తెలిపారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఉప్పేర్ నరసింహ తో పాటు గద్వాల జిల్లా అఖిలపక్ష రాజకీయ పార్టీలు సామాజిక ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు