సిఐటియు నిర్మాణ వ్యతిరేక చర్యలపై జిల్లా అధ్యక్ష,కార్యదర్శుల తొలగింపు
Uncategorizedజూలై 9 సమ్మెను జయప్రదం చేయాలని పిలుపు
E69NEWS వరంగల్,జూన్ 21
సిఐటియు నిర్మాణ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ,వరంగల్ జిల్లా అధ్యక్షుడు మాలోతు సాగర్,కార్యదర్శి ముక్కెర రామస్వామిని అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తూ,జిల్లా విస్తృత సమావేశం నిర్ణయం తీసుకుంది.ఈ సమావేశం శనివారం ఉర్సుగుట్ట పల్లం కన్వెన్షన్ హాల్లో,జిల్లా ఉపాధ్యక్షులు ఇనుముల శ్రీనివాస్,ఎం.డి మహబూబ్ పాషా అధ్యక్షతన జరిగింది.సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి జే. వెంకటేష్,రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు,రాష్ట్ర కార్యదర్శులు రాగుల రమేష్,కాసు మాధవి హాజరయ్యారు.తొలగింపుకు కారణంగా,సిఐటియు ప్రతిష్టను హానిచేసేలా,వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటూ,సమావేశాలు నిర్వహించకుండా,కార్మికులు మరియు పేదల వద్ద నుంచి వసూలు చేసిన రూపాయలకు లెక్కలు చెప్పకపోవడం,క్రమశిక్షణ లేమి వంటి విషయాలను సమావేశం పేర్కొంది.సిఐటియు శ్రేణులంతా ఈ చర్యను గమనించి సంఘాన్ని ఐక్యం చేయడంలో కృషి చేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.అదే విధంగా,జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలన్న పిలుపు కూడా ఇచ్చారు.బిజెపి ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక,ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ,నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్న డిమాండ్‌తో జరగనున్న ఈ సమ్మెలో,సిఐటియు సభ్యులు,కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా అధ్యక్షుడు టి.ఉప్పలయ్య,వరంగల్ జిల్లా నాయకులు ఆరూరి కుమార్,ఎండి బషీర్,సాంబయ్య,జన్ను ప్రకాష్,సింగారపు కృష్ణ,చాగంటి వెంకటయ్య,వీరగోని నిర్మల,చినగారి రాణి,పద్మ,దివ్య,సౌమ్య తదితరులు పాల్గొన్నారు.