
జఫర్ ఘడ్కు గర్వకారణంగా నిలిచిన విద్యార్థిని
జఫర్ ఘడ్కు గర్వకారణంగా నిలిచిన విద్యార్థిని
E69NEWS జఫర్ ఘడ్, జూన్ 21
జనగామ జిల్లా జఫర్ ఘడ్ మేజర్ గ్రామపంచాయతీకి చెందిన మాజీ సర్పంచ్ బల్లెపు వెంకట నరసింహ రావు,విజయలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె బల్లెపు మహాలక్ష్మి,ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో హెచ్ఈసి గ్రూప్లో స్టేట్ మూడో ర్యాంక్ సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచింది.హనుమకొండలోని లాల్ బహుదూర్ కళాశాలలో ప్రథమ సంవత్సరంలో చదువుతున్న మహాలక్ష్మి, సమిష్టిగా కృషిచేస్తూ తన ప్రతిభను నిరూపించుకుంది.ఆమె ఈ విజయం సాధించడంలో తల్లిదండ్రులు,అధ్యాపకులు,స్నేహితులు,గ్రామస్థుల సహకారం మరవలేనిదని తెలిపింది.భవిష్యత్తులో డిగ్రీ చదువు పూర్తిచేసి సివిల్ సర్వీసుల్లో ప్రవేశించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతానని మహాలక్ష్మి స్పష్టం చేసింది.ఆమె విజయాన్ని పురస్కరించుకుని గ్రామస్తులు,బంధుమిత్రులు,కళాశాల అధ్యాపక బృందం ఘనంగా అభినందనలు తెలిపారు.