ఈ69న్యూస్,పామిడి. పామిడి పట్టణం లోని వాసవి కన్యాకాపరమేశ్వరి అమ్మవారిని శంకంబరి అలంకరణలో తీర్చిదిద్దారు.వివిధ రకాల ఆకు కూరలు, కూరగాయలు, పళ్లతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.ఆషాడ మాసం తొలి శుక్రవారం సందర్బంగా అష్టోత్తర శత నామవాళి కుంకుమ అర్చన, భక్తిగీత లాపన, ప్రాకరోత్సవం, నిర్వహించి, భక్తులందరికి ప్రజలకు పరిపూర్ణ ఆహారం లభించేందుకు ఈ అలంకరణ చేస్తారని ఆహారం కావాలంటే వర్షం అవసరమని అందుకే ఈ అలంకరణ చేసి పూజలు నిర్వహిస్తునమని వాసవి మాతృమండలి తెలిపారు.మాతృ మండలి అధ్యక్షులు ఎన్ వి ఎస్. నాగవల్లి, కార్యదర్శి కీర్తి, గౌరవ అధ్యక్షులు రాజేశ్వరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించి అందరికీ మహమంగళ హారతి అనంతరం అల్పాహారం అందించారు.ఆర్యవైశ్య సంఘం వారు పర్యవేక్షించారు.