ఘనపూర్లో బూత్ లెవెల్ ఆఫీసర్ల శిక్షణ తరగతులను పర్యవేక్షించిన ఆర్డీవో డిఎస్ వెంకన్న ఈ69న్యూస్ జనగామ: స్టేషన్ ఘనపూర్ మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ ప్రాథమిక బాలికల ఉన్నత పాఠశాలలో బూత్ స్థాయి అధికారులకు నిర్వహించిన శిక్షణ తరగతులను గురువారం రెవెన్యూ డివిజనల్ అధికారి డి.యస్.వెంకన్న పర్యవేక్షించారు.ఈ సందర్భంగా బిఎల్వోలకు ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణ ఇచ్చి,అనంతరం వారికీ ఆన్లైన్ పరీక్షను నిర్వహించారు.కార్యక్రమంలో స్థానిక తహసిల్దార్ వెంకటేశ్వర్లు,మాస్టర్ ట్రైనర్లు రాజేందర్,నరేందర్,గిర్దావర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.మండల పరిధిలోని అందరు బిఎల్వో లు ఈ శిక్షణలో పాల్గొన్నారు.