దొడ్డి కొమురయ్య అమరత్వ స్ఫూర్తితో ప్రజా పోరాటాలు నిర్వహించాలి-ఇర్రి అహల్య
Uncategorized
ఈ69న్యూస్ జనగామ:స్టేషన్ ఘన్పూర్ మండల కేంద్రంలో శుక్రవారం రోజు సిపిఎం కార్యాలయంలో వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యురాలు ఇర్రి అహల్య హాజరయ్యారు.దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు అనంతరం మాట్లాడుతూ నాడు జరిగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలోనే సువర్ణ అక్షరాలచే లికిపబడిందన్నారు.పోరాటంలో తొలి అమరుడుగా దొడ్డి కొమురయ్య అమరత్వం పొందాడన్నారు.నాడు కడవెండిలో ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో ప్రజా ర్యాలీ జరుగుతా ఉంటే దొరసాని జానకమ్మ గుండాలు ర్యాలీ పై గుండాలు కాల్పులు జరిపితే దొడ్డి కొమురయ్య అమరత్వం పొందాడని అన్నారు.ఆనాటి నుంచి ఆంధ్ర మహాసభ సాయుధ పోరాట పిలుపు ఇవ్వడంతో తెలంగాణ వ్యాప్తంగా భూస్వామ్య గుండాలను తరిమికొట్టడానికి గ్రామ దళాలు ఏర్పడ్డాయని దాని ఫలితంగా రైతాంగ సాయుధ పోరాటం ప్రారంభించి 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని వేల గ్రామాలను భూస్వాముల నుండి గ్రామ రాజ్యాలుగా ఏర్పడ్డాయన్నారు నాడు జరిగిన పోరాటం భూస్వాములకు పేదలకు మధ్య జరిగిన పోరాటమన్నారు.నేడు ఆ పోరాటానికి సంబంధం లేని కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ముస్లిం హిందువులకు జరిగిన పోరాటంగా చిత్రీకరిస్తున్నారని వారికి ఆ పోరాటంతో ఏనాడైనా సంబంధం ఉన్నదా అని ప్రశ్నించారు బిజెపి లో ఉన్న ఏ ఒక్క నాయకుడైన సాయిధ పోరాటంలో పాల్గొన్న చరిత్ర ఉందా అని అన్నారు.చరిత్రను వక్రీకరిస్తే తెలంగాణ ప్రజలే వారికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని ప్రైవేటుపరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు అప్పగిస్తుందని అన్నారు.నాలుగు లేబర్ కోడ్ బిల్లులను తెచ్చి కార్మికుల పొట్ట కొడుతుందన్నారు.ఎనిమిది గంటల పని దినం నుండి 12 గంటల పని దినం తీసుకువస్తుందని అన్నారు అడవులను అంబానీ,ఆదాని లకు అప్పజెప్పడానికి ఆదివాసులపై దాడులు చేస్తుందన్నారు కేంద్ర ప్రభుత్వ విధానాలపై దొడ్డి కొమురయ్య అమరత్వ స్ఫూర్తితో పోరాటం నిర్వహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి మునిగెల రమేష్ బహుజన నాయకులు అక్కేనపల్లి వెంకటేశ్వర్లు సిపిఎం మండల కమిటీ సభ్యులు కత్తుల రాజు తోడెంగల ఐలయ్య చిలుముల్ల భాస్కర్ నాయకులు పోగుల సుధాకర్ పొలసు పద్మాకర్ శాతపురం రవి తదితరులు పాల్గొన్నారు.