భూగర్భజల పరిరక్షణపై కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సమీక్ష ఈ69న్యూస్ జనగామ:మన జిల్లా – మన నీరు కార్యక్రమంలో భాగంగా ఇంకుడు గుంతల నిర్మాణంపై జిల్లా కలెక్టర్ డా.రిజ్వాన్ భాషా షేక్ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ప్రతి ఇంట్లో, ట్యాంకుల వద్ద సోక్పిట్లు నిర్మించాలని,నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.వర్షపు నీటిని భద్రపరచడం, ప్రజల్లో అవగాహన పెంచడంలో ఉపాధ్యాయులు, వాలంటీర్ల పాత్ర కీలకం అని తెలిపారు.వనమహోత్సవం సందర్భంగా మొక్కల నాటింపు, గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.