టీవీ9 రిపోర్టర్ గరదాసు ప్రసాద్ గుండెపోటుతో మృతి–జర్నలిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం ఈ69న్యూస్ సిరిసిల్ల: సిరిసిల్ల టీవీ9 రిపోర్టర్‌గా సేవలందించిన గరదాసు ప్రసాద్ ఆకస్మికంగా గుండెపోటుతో కన్నుమూశారు.శుక్రవారం ఉదయం అస్వస్థతకు గురైన ప్రసాద్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ,చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.ఆయన వయసు సుమారు 45 సంవత్సరాలు.సంఘటనపై స్థానిక జర్నలిస్టుల సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.ఆయన మరణంతో మీడియా రంగం ఎంతో నిష్ణాతుడైన పాత్రికేయుడిని కోల్పోయిందని పలువురు విలేకరులు అన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్అధ్యక్షుడు మామిడి సోమయ్య,ఉపాధ్యక్షులు వల్లాల జగన్,బండి విజయ్ కుమార్తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ,గరదాసు ప్రసాద్ కుటుంబానికి అన్ని విధాలుగా మద్దతుగా నిలుస్తామని తెలిపారు.గరదాసు ప్రసాద్ సేవలు గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని చిత్తానికి అప్పగిస్తున్నామని వారు పేర్కొన్నారు.ప్రసాద్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబానికి మద్దతుగా జర్నలిస్టు సంఘాలు ముందుకు రావాలని పలువురు నాయకులు కోరుతున్నారు.