
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్:భారత గొప్ప దళిత నాయకుడు,స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ 39వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య.ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ..జగజ్జీవన్ రామ్ జీవితమే ఓ పాఠశాల,ఆయన సామాజిక న్యాయం కోసం చేసిన కృషి యువతకు ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.దేశ ఉపప్రధానిగా,రక్షణ మంత్రిగా,వ్యవసాయ రంగంలో సంస్కరణలకు నాంది పలికిన నాయకుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.