
ఈ69న్యూస్ జనగామ జూలై 5: భూగర్భ జలాలను పరిరక్షించేందుకు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ “మన జిల్లా-మన నీరు అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.తక్కువ ఖర్చుతో ప్రతి ఇంటి వద్ద, ప్రభుత్వ కార్యాలయాల్లో,పాఠశాలల్లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ ఉద్యమం కింద 5000 గుంతల నిర్మాణం లక్ష్యంగా ఉండగా,ఇప్పటివరకు 1076 గుంతలు పూర్తయ్యాయి.గ్రామ పంచాయతీలు వృథాగా ఉన్న రాళ్లు,శిథిల దిబ్బలను వినియోగించి నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.కలెక్టర్ మాట్లాడుతూ…ప్రతి నీటి బొట్టూ భూమిలోకి ఇంకేలా చూడాలి.ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని తెలిపారు.ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు రావాలని, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క గుంత అయినా నిర్మించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.