
సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్ట ఆంజనేయులు
వనపర్తి పట్టణంలో సిఐటియు- ఏఐటీయూసీ – టి యు సి ఐ- బి ఆర్ టి యు- టిఎన్టియుసి- ఐసిఇయు తదితర సంఘాల ఆధ్వర్యంలో వనపర్తి పాలిటెక్నిక్ నుండి బయలుదేరిన మహా ప్రదర్శన రాజీవ్ చౌక్, శంకర్ గంజ్, కమాన్ చౌరస్తా, గాంధీ చౌక్, రామ టాకీస్ ఏరియా నుండి జూనియర్ కళాశాల మైదానానికి చేరుకున్నది. అక్కడ జరిగిన బహిరంగ సభలో సిఐటి యు జిల్లా ఉపాధ్యక్షులు కే. సునీత, ఏఐటియుసి నాయకులు రమేష్, టి యు సి ఐ నాయకులు గణేష్ బిఆర్టీయూ నాయకులు విజయకుమార్ ,టి.ఎన్. టి యు సి
నాయకులు శంకర్ ల అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభకు ప్రధాన వక్తులుగా సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్ట ఆంజనేయులు, టి యు సి ఐ జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మోష, బి ఆర్ టి యు జిల్లా నాయకులు గట్టు యాదవ్ ప్రసంగిస్తూ పెట్టుబడిదారుల కోసం కార్మిక వర్గాన్ని బలి చేస్తారా? నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ యాక్ట్ 1926ను నేడు బిజెపి కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని, సంగం పెట్టుకునే హక్కు కష్టతరంగా మార్చిందని, 1886లో సాధించుకున్న ఎనిమిది గంటల పని దినాన్ని నేడు రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం 12 గంటలు పనిచేయాలని నిర్ణయించిందని, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 282 తెచ్చి పది గంటల పని చేయాలని నిర్ణయించడం దారుణం అన్నారు. పారిశ్రామిక సంబంధాల కోడ్ పేరుతో ట్రేడ్ యూనియన్ చట్టం 1926, ఇండస్ట్రియల్ ఎంప్లాయిమెంట్ చట్టం 1946, పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ఈ మూడు చట్టాలు రద్దు చేసి పారిశ్రామిక సంబంధాల కోడు 2020 తీసుకొచ్చిందని ఇది ఉద్యోగ భద్రతకే ప్రమాదము తెచ్చిందని విమర్శించారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయిమెంట్ పేరుతో అభద్రతగా జీవించే స్థితి తెచ్చింది అన్నారు. కార్మిక శాఖను మధ్యవర్తిత్వ శాఖ గా మార్చిందన్నారు. సామాజిక భద్రత కోడ్ పేరుతో 9 కార్మిక చట్టాలను రద్దుచేసి పీఎఫ్, ఈఎస్ఐ భద్రత లేకుండా చేసిందన్నారు. స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించే పని పక్కన పెట్టిందన్నారు. వేతనాల కోడ్ పేరుతో వేతనాల చెల్లింపు చట్టం 1936, కనీస వేతనాలు చట్టం 1948, బోనస్ చెల్లింపు చట్టం 1965, సమాన వేతన చట్టం 1976 ఈ నాలుగు చట్టాల స్థానంలో వేతనాలు కోడ్ తెచ్చి వేతనాలకు గ్యారెంటీ లేకుండా చేసింది అన్నారు. వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, వర్కింగ్ కండిషన్స్ కోడు పేరుతో మొత్తం 13 చట్టాలను రద్దుచేసి ఈ కోడ్ తెచ్చింది అన్నారు. బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ కు పన్ను వసూలు అయిపోయిందని మిగతా అనేక చట్టాలు మారిపోయి కార్మికులకు కనీస హక్కులు లేకుండా కాంట్రాక్టు కార్మికులకు గతంలో ఉన్న భద్రత లేకుండా చేశారన్నారు కాంట్రాక్టర్ కనీస వేతనం పిఎఫ్ ,ఈఎస్ఐ తదితర చట్టపరమైన హక్కులు అమలు చేసేందుకు, చేయించేందుకు ఉన్న ప్రిన్సిపాల్ ఎంప్లాయర్ బాధ్యత లేకుండా చేసిందన్నారు. కాంట్రాక్టర్ దయ దక్షిణ్యాలకు వదిలేసిందన్నారు. కావున కేంద్ర బిజెపి ప్రభుత్వం సంపన్నులు మరింత సంపన్నులు చేస్తూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు సిద్ధమైందని దీనికి వ్యతిరేకంగా ఈరోజు జరిగిన సమ్మె నరేంద్ర మోడీకి ఒక చెంపపెట్టు అని అన్నారు. వెంటనే లేబర్ కోట్లు రద్దు చేయాలని, ఈ చట్టాలను వెనక్కి కొట్టాలని కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ రద్దు చేయాలని ,కనీస వేతనం 26,000 ఇవ్వాలని ,కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని ,కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, స్కీం వర్కర్లను పర్మినెంట్ చేయాలని, హమాలీ, రవాణా రంగం తదితర కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు .రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విధానాలను అనుసరించేందుకు సిద్ధమవుతుందని కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలుకు సిద్ధమైందని వీటికి వ్యతిరేకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక ప్రజావ్యతిరేక విధానానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీలు, ఆశా వర్కర్స్, మున్సిపల్ కార్మికులు, గ్రామపంచాయతీ కార్మికులు, జిల్లా కలెక్టరేట్ స్వీపర్స్ అండ్ గార్డెన్ వర్కర్స్, కడుకుంట్ల బెవరేజెస్ హమాలీలు, వనపర్తి వ్యవసాయ మార్కెట్ హమాలీలు, హనుమాన్ టెక్డి హమాలీలు, న్యూ గంజు టౌన్ బజార్ హమాలీలు, తోపుడుబండ్ల కార్మికులు, కార్పెంటర్స్ వర్కర్స్, కస్తూర్బా వర్కర్స్, జిల్లా ఆస్పత్రి కార్మికులు, మెడికల్ కాలేజీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం. పరమేశ్వర చారి, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ.
లక్ష్మి, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం. రాజు , టి యు సి ఐ జిల్లా నాయకులు కురుమయ్య, ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ, ఎల్ఐసి ఐసిఈయు బ్రాంచ్ అధ్యక్షులు రామకృష్ణ, బ్రాంచ్ కార్యదర్శి బిసన్న, ప్రజా వాగ్యేయకారుడు రాజారాం ప్రకాష్ ఆట, పాట డప్పుల దరువులచే అలరింపజేశారు. కళాకారుడు ఎన్. నాగరాజు, బాలే మియా, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నందిమల్ల రాములు, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బి. కవిత, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గంధం మదన్, జిల్లా నాయకులు డి. కురుమయ్య, జి. బాలస్వామి, కస్తూర్బా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షహీదా, తెలంగాణ జేఏసీ నాయకులు వేణుగోపాల్ ,డిటిఎఫ్ నాయకులు ఏసోప్ ,ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బుచ్చమ్మ, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బాలు, నాయకులు గడ్డం కురుమయ్య, యాదగిరి, లాల్ ,గోపాల్, గ్రామపంచాయతీ యూనియన్ జిల్లా అధ్యక్షులు హనుమంతు నాయక్, శ్రీనివాసులు, దాసు, కడుకుంట్ల బేవరేజెస్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ప్రభాకర్, కార్యదర్శి రామకృష్ణ ,జిల్లా కలెక్టరేట్ ఔట్సోర్సింగ్ స్వీపర్సు అండ్ గార్డెన్ వర్కర్స్ యూనియన్ నాయకులు సుగుణ, అరుణ, మన్యం తదితరులు పాల్గొన్నారు