ఎమ్మెల్యే కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపిన అన్నం పవిత్ర-అశోక్ దంపతులు E69 న్యూస్ హనుమకొండ:ధర్మసాగర్ మండలంలోని ముప్పారం గ్రామంలో ఇందిరమ్మ హౌసింగ్ పథకం కింద కేటాయించిన ఇంటిని అన్నం పవిత్ర-అశోక్ దంపతులు శుభారంభం చేశారు.శనివారం వారు తమ నివాస నిర్మాణానికి సంప్రదాయబద్ధంగా ముగ్గు వేయడంతో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ ప్రభుత్వానికి,ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.అలాగే ఈ ఇంటి కేటాయింపులో తమకు సహకరించిన ఎం.పి.డి.ఓ అనిల్,గ్రామ సెక్రటరీ సురేష్,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహేందర్ రెడ్డి,మాజీ పీఏసీఎస్ డైరెక్టర్ రమేష్ రెడ్డి,మాజీ సర్పంచ్ గొనెల సమ్మక్క-రాజయ్యలకూ ధన్యవాదాలు తెలిపారు.ఇందిరమ్మ కమిటీ సభ్యులైన మాజీ ఎం.పీ.టి.సీ పెద్ది శ్రీను,గై కృష్ణమూర్తి,కోతి సాంబరాజు,గొల్లపల్లి వెంకట్రాజ్యం,కొరిమి శిరీషలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారుఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ వేములకొండ రజిత-బిక్షపతి,బూత్ కన్వీనర్ అన్నం యాదగిరి,చిట్యాల రాజు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.