న్యాయవాద పరిషత్ హనుమకొండ-వరంగల్ జిల్లా నూతన కమిటీ ఎన్నిక
Uncategorized
ఈ69న్యూస్ హనుమకొండ:-హనుమకొండ మరియు వరంగల్ జిల్లాల న్యాయవాదులు తేది 14-07-2025న సమావేశమై న్యాయవాద పరిషత్ జిల్లా యూనిట్‌ను ఏర్పాటు చేశారు.ఈ సమావేశం సీనియర్ న్యాయవాదులు వై.శ్యాంసుందర్ రెడ్డి,సి.హెచ్.చిదంబర్నాథ్,ఎల్.జలేందర్ రెడ్డి,మాతంగి రమేష్‌బాబు,కె.వి.కె.గుప్తా,పింగిలి సంజీవరెడ్డి,చామర్తి ప్రభాకర్,కామారపు రాజేశ్వర్ తదితరుల సమక్షంలో జరగింది.ఈ సందర్భంగా జరిగిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా చొల్లేటి రామకృష్ణ న్యాయవాది,ప్రధాన కార్యదర్శిగా వి.మురళీధర్ రెడ్డి న్యాయవాది,కోశాధికారిగా యం.సంపత్ న్యాయవాది ఎన్నుకోబడ్డారు.ఇంతేకాక,నలుగురు ఉపాధ్యక్షులుగా సి.హెచ్.చిదంబర్నాథ్,పి.సుదర్శన్,పి.ప్రవీణ్ కుమార్,పి.వెంకటేశ్వర్లులను ఎన్నుకోగా,ఐదుగురు సెక్రెటరీలుగా టి.గౌతం ప్రసాద్,కె.పూర్ణచందర్,యం.శ్రీధర్ గౌడ్,పి.కమలాకర్,పి.తేజారెడ్డి ఎంపికయ్యారు.కార్యవర్గ సభ్యులుగా బి.అనిల్ కుమార్,బి.రమేష్,సి.హెచ్.నాగమణి,ఎస్.ఇందు,వి.సుధారెడ్డి,టి.లక్ష్మణ్,టి.లింగమూర్తి,బి.ఆదిరెడ్డి,టి.చంద్రశేఖర్,ఎ.నాగరాజు,కె.జగదీష్,పి.శ్రీనివాస్,ఆదిరెడ్డి సహా ఇతరులు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సి.హెచ్.ప్రభాకర్,న్యాయవాద పరిషత్ ప్రాంత ప్రధాన కార్యదర్శి సెంసాని సునిల్ ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీకి అభినందనలు తెలుపుతూ,న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేస్తామని నూతన నాయకులు హామీ ఇచ్చారు.