ఈ69న్యూస్ వరంగల్:-ఇంతెజార్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు సెల్ఫోన్లు పోయిన కేసులను విజ్ఞానపూర్వకంగా పరిశీలించి,వాటిని సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ట్రాక్ చేసి తిరిగి వారి యజమానులకు అప్పగించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.ఇంతెజార్గంజ్ ఇన్స్పెక్టర్ ఎం.ఎ.షుకూర్ నాయకత్వంలో,ఎస్ఐ వెంకటేశ్వర్లు,ఎస్ఐ రవికిరణ్ సమర్ధవంతంగా దర్యాప్తు నిర్వహించి సెల్ఫోన్లను గుర్తించారు.ఆన్లైన్ రైటర్ సందీప్,క్రైమ్ కానిస్టేబుల్ దీపక్ లు ఈ ట్రాకింగ్ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు.సెల్ఫోన్లు తిరిగి పొందిన బాధితులు పోలీసులు తీసుకున్న చొరవపై సంతోషం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ ఎం.ఎ.షుకూర్,బాధితులకు సెల్ఫోన్లను స్వయంగా అప్పగిస్తూ,ఆదర్శంగా పని చేసిన తమ సిబ్బందిని అభినందించారు.ఇలాంటి చర్యల ద్వారా పోలీసుల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.