TWJF వరంగల్ నూతన కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశం TWJF వరంగల్ నూతన కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే సమావేశం ఈ69న్యూస్ హనుమకొండ జూలై 17:తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (TWJF) వరంగల్ జిల్లా నూతన కమిటీని ఇటీవలే ఎన్నుకున్న సందర్భంగా,కమిటీ సభ్యులు వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే,విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.హన్మకొండ సుబేదారిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పూల మొక్కను అందించి ఎమ్మెల్యే కి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ..మీడియా ప్రజల అభిప్రాయాలకు ప్రతిరూపం.జర్నలిస్టుల సంక్షేమం కోసం నా వంతు సహకారాన్ని ఎల్లప్పుడూ అందిస్తాను.మీ సమస్యల పరిష్కారానికి నేను అంకితభావంతో ఉన్నాను అని అన్నారు.ఈ సమావేశంలో వరంగల్ జిల్లా TWJF అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్,ఉపాధ్యక్షులు వెల్డ్ రాజేందర్,స్వామినాథ్,కరిమిల్ల దుర్గారావు,కార్యదర్శి బొట్ల బొట్ల స్వామి,కోశాధికారి బానోతు సురేష్,సహాయ కార్యదర్శులు బావాండ్లపల్లి కిరణ్ కుమార్,గాదం సురేష్,రాంపల్లి శ్రీనివాస్,కార్యవర్గ సభ్యులు విజయేందర్,సాంబయ్య,కౌన్సిల్ సభ్యులు పాలడుగుల సురేందర్,అడుగుల నరసింహారావు,జాతీయ కౌన్సిల్ సభ్యుడు బి.మల్లేశం తదితరులు పాల్గొన్నారు.